Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver1
2いいね 545 views回再生

తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం|పేలాలపిండి తయారు విధానం|పేలపిండి ప్రసాదం ఆరోగ్య రహస్యాలు|Tirupathi Rao|

తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం

పేలపిండిని ఎలా తయారు చేయాలి?

పేలాలపిండి తయారుచేసే విధానం...
పేలపిండి ప్రసాదంలో గల ఆరోగ్య రహస్యాలు.


ముందుగా జొన్న పేలాలను తీసుకొని మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి.

తరువాత జొన్న పేలాల పొడి,తురిమిన బెల్లం ను మిక్సీ లో వేసి కలుపుకోవాలి.

నెయ్యి ని,చివరిగా యాలకులను పొడి చేసుకొని పేలాలు పొడి మిశ్రమం లో కలుపుకోవాలి.

ఇప్పుడు రుచికరమైన పేలపిండి సిద్ధం.

గమనిక:
జొన్నపేలాలను మిక్సీ లో రవ్వ గా చేసుకోవాలి.మరి మెత్తగా చేయరాదు.

పేలపిండి ప్రసాదంలో గల ఆరోగ్య రహస్యాలు...


గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం...
తోలి ఏకాదశి రోజులలో తొలకరి వర్షాల వలన వాతావరణ మార్పులు జరిగి
శారీరక రుగ్మతలు,వ్యాధులు వస్తాయి.
అలాగే బయట ఉష్ణోగ్రతలకు అనుగుణముగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది.

పేలపిండి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ని పెంచి,వ్యాధులను రాకుండా చేస్తుంది.
పేలపిండి ని తినడం వలన శరీరం బలంగా తయారవుతుంది.
శరీరానికి వేడిని కలుగజేస్తుంది.జలుబు,దగ్గు వంటి వాటిని రాకుండా చేస్తుంది.
అందువల్ల తొలి ఏకాదశి రోజు పేలపిండి ని ఇంటిలో,గుడిలో ప్రసాదం గా పెడతారు.

తొలి ఏకాదశి నాడు పేలపిండి ని తప్పక తినాలని అంటారు.
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి..
మన పూర్వీకులను ఈ రోజు గుర్తుచేసుకుంటూ పేలపిండి ప్రసాదం తీసుకోవాలి.

మీకు,మీ కుటుంబసభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

#ToliEkadasiSpecialNaivedyam #HealthSecretsInpelapindi

Toli Ekadasi Special Naivedyam|PelalaPindi Tayari vidhanam,Pelapindi Prasadamlo Gala Arogya Rahasyalu,Tirupathi Rao

コメント