Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: wtserver3
17665いいね 4245641回再生

Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv

Title: Sri DattatreyaSwamy Chalisa
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Tandugu Krishna Rao
Dattatreya Devotionals
#devotionalchants
#dattatreyaswamy
#dattatreyaswamysongs
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
దత్తాత్రేయ చాలీసా
రచన: త్రినాధమూర్తి జరజాపు

సర్వమంత్ర స్వరూపాయ
సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ
సర్వసిద్ధి ప్రదాతాయ

యోగీశాయ యోగధీశాయ
యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
శివరూపాయ దత్తాత్రేయ

శూలహస్తాయ కృపానిధాయ
జరాజన్మముల వినాశకాయ
భవపాశముల విముక్తాయ
సర్వరోగహర దత్తాత్రేయ

కర్పూరకాంతి దేహాయ
వేదశాస్త్ర పరిజ్ఞనాయ
మూర్తిత్రయ స్వరూపాయ
దివ్యరూపాయ దత్తాత్రేయ

నమో భగవతే దత్తాత్రేయ
స్మరణమాత్రమున సంతుష్టాయ
జ్ఞానప్రదాయ చిదానందాయ
మహాయోగి ఓ అవధూతాయ

సర్వానర్ధము సర్వక్లేశములు
ప్రపన్నార్తిహర సనాతన
శరణాగతులు దీనార్తులకు
ఆపదోద్ధార నారాయణ

గురువై ఇలలో జనియించి
దైవం గురువుగ సాక్షాత్కరించిన
దత్తాత్రేయుని అవతారం
నిరంతరాయం అతిరహస్యము

కామక్రోద మదమాత్సర్యములు
దేవదత్తముగ జయించి త్యజించ
మనుజులందరకు మనోవికాశం
ప్రేరణమే అవతారలక్ష్యం

బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామయణమున
ప్రస్తుతించిన దైవస్వరూపుడు

అధర్వణవేద అంశముగా
దత్తాత్రేయ ఉపనిషత్తులో
మోక్షసాధనకు ఉపకరించిన
శిశురూపునిగా వర్ణితుడు.

దుష్టశిక్షణ శిష్టరక్షణకు
శ్రీమహావిష్ణు అవతరణములు
విధి నిర్వహణానంతరము
పరిసమాప్తమగు సరణములు

దత్తాత్రేయుని అవతారం
కార్యాచరణం ప్రత్యేకం
జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
మనుజులున్నతే పరమార్ధం

అంబరీషుడను రాజు పూర్వము
హరిచింతనము అతిధిసేవలతొ
ఏకాదశి వ్రతమాచరించగ
దూర్వాసుండటకరుదెంచే

ద్వాదశ తిదికొక ఘడియముందుగా
అరుదెంచిన దూర్వాసుని కొలిచి
అనుష్టానము పూర్తిచేసుకొని
శీఘ్రమె రమ్మని ఆహ్వానించే

పారణ సమయం మీరుతున్నను
మహర్షి ఎంతకు రాకుండుటచే
వ్రతభంగమును అతిధి అలక్ష్యము
సేయకుండ తీర్ధము సేవించెను

తిరిగేతెంచిన దూర్వాసముని
విషయము తెలిసి క్రోదముచెంది
నానాయోనుల జన్మింతువని
అంబరీషునకు శాపమొసంగెను

భీతిచెందిన అంబరీషుడు
మహావిష్ణుని శరణువేడగా
శ్రీహరి అంతట సాక్షాత్కరించి
భక్తుని రక్షణగా తా నిలిచె

ముని శాపము వ్యర్ధముగానీక
హరియే దానిని ప్రతిగ్రహించి
అవతారములను ఎత్తి ధాత్రిలో
లోకోపకారం గావించే.

అత్రిమహాముని అర్ధాంగి
అనసూయ ఒక మహాపతివ్రత అని
సతులతొనున్న త్రిమూర్తులముందు
నారదుడొకపరి ప్రశంసించెను

అంతట ముగ్గురుదేవేరులును
ఈర్ష్యచెంది అనసూయాదేవి
పాతివ్రత్యము తగ్గించమని
త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి

త్రిమూర్తులంతట అతిధి వేషమున
అత్రి ఆశ్రమముకేతెంచ
అనసూయ వారినాహ్వానించి
అర్ఘ్యపాదాదులర్పించే

ఆకలిగొన్న అతిధులు తాము
ఎంతమాత్రము తాళలేమన
వడ్డనకచ్చట సిద్ధముచేసి
అనసూయ వారినాహ్వానించే

అనసూయ కట్టు వస్త్రము విడిచి
దిగంబరంగా వడ్డించమని
అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే

ఆకలిగొన్న అతిధులు మరలిన
గృహస్తు పుణ్యము పోవునని
నగ్నముగా పురుషుల యెదుటున్నను
పతివ్రత్యము భంగమని

పరస్పరముగా విరోధమైన
ధర్మముల నడుమ చిక్కించుటకు
చూసిన అతిధులు అసామాన్యులని
వారిషరతునకు సమ్మతించినది

అత్రిమహర్షి పాదుకలను తన
పతిగాతలచి ఆనతినడిగి
వచ్చినవారు నాబిడ్డలుగా
తలచి వడ్డింతు నని తెలిపినది

మహాపతివ్రత అనసూయ
మహిమాన్వితమగు సంకల్పముచే
వడ్డించుటకై ఏగునంతలో
పసిపిల్లలైరి ముగ్గురును

ఆమెభావనను అనుసరించుచు
బలింతవలె స్తన్యమొచ్చినది
వెనువెంటనే తను వస్త్రము ధరించి
పసిపిల్లలకు స్తన్యమిచ్చినది

అనసూయ తన దివ్యదృస్టితో
పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
గ్రహించి వారిని ఊయలనుంచి
జరిగిన కథ జోలగా పాడినది

ఇంతలో అత్రిమహర్షి వచ్చి
జరిగిన సంగతి సతి వివరించగ
ఊయలనున్న త్రిమూర్తుల జూచి
పలువిధంబుల స్తుతియించే

అత్రిమహర్షి స్తోత్రముచేయగ
త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
నిజరూపములతొ ప్రత్యక్షమయి
కోరిన వరమును ఈయబూనిరి

మనసులోనైన కనని భాగ్యం
నీభక్తివలన కలిగె దర్శనం
నీఅభీష్టము నివేదించమని
అత్రిమహర్షనసూయను కోరెను

సృష్టివికాశమె మీఅభిమతము
దానికనుగుణమె బాలలసృష్టి
ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
వరమిమ్మని అనసూయ కోరినది

మీఅవతరము లక్ష్యము తీర్చుట
నాఅభీష్టము అనవిని అత్రియు
మాకొమరులుగా పుట్టి మమ్ములను
వుద్ధరించమని కోరెనంతట

అంతట త్రిమూర్తులానందముగా
అత్రిమహర్షి కోరికతీర్చగ
వారికివారు దత్తమిచ్చుకొని
రాదంపతుల అభీష్టసిద్ధిగా

త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
అత్రి అనసూయ దంపతులింట
అవతరించెను దేవదేవుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు

పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
సచ్చిదానంద స్వరూపుడు
శ్రుతులకు అందని కారణ జన్ముడు
పిలిచిన పలికే దేముడు

మానవులందరి అభీష్టములను
నెరవేర్చే అవతారపురుషుడు
జ్ఞానము యోగము ప్రసాదించగా
తలచిన క్షణమున కాచేవిభుడు

దూర్వాశ శాపం ఫలితం గానే
పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
అనుగ్రహించును భక్తులను

సర్వజనులను ఉద్ధరించుటే
దత్తావతారం ముఖ్యకార్యము
ఆదిగురువుగా దత్తాత్రేయుడు
నిలుచును భువిలో అనవరతం.

NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting YouTube about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

コメント